తెలుగు స్థానికీకరణ - స్వేచ్ఛ సాఫ్టువేరు

ఏమిటి?

Telugu Localisation = తెలుగు స్థానికీకరణ
 1. వివిధ ఉపకరణాల తెలుగీకరణకు తోడ్పడడం.
 2. కొత్త తెలుగు పదాల సృష్టి మరియు క్రోడీకరణ విషయమై జరిగే కృషికి ప్రచారం కల్పించడం.
Free(dom) Software = స్వేచ్ఛ సాఫ్టువేరు

ఏ సాఫ్టువేరుని అయినా స్వేచ్ఛ సాఫ్టువేరు అనాలంటే అది నాలుగు సూత్రాలకు కట్టుబడి ఉండాలి.

 1. సాఫ్టువేరుని ఏ అవసరానికైనా స్వేచ్చగా వినియోగించుకునే హక్కుండాలి.
 2. దానిని తమ అవసరాలకనుగుణంగా మలచుకునే అవకాశం ఉండాలి అంటే సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండాలి.
 3. దానిని అభివృద్ది చేసి ఇతరులకు అద్దెకు గాని ఉచితంగా గాని ఇచ్చే హక్కు ఉండాలి.
 4. జత చేసిన, మలచిన, అభివృద్ది చేసిన సాఫ్టువేరుని కూడా స్వేచ్ఛ సాఫ్టువేరుగా విడుదల చేయాలి.

ఎందుకు?

సాధారణ ప్రజలందరు తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలి. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకి చేరాలి అనే ధ్యేయంతో మనం కృషి చేయాలి. పై లక్ష్యసాధనను ఈ క్రింది అంచెలలో సాధించాలి.

 • పరిచయం: కంప్యూటర్లలో తెలుగును చూడవచ్చు మరియు వ్రాయవచ్చని ప్రజలు తెలుసుకోవడం.
 • ఆదరణ: అంతర్జాల అనుసంధానమున్న సామాన్య ప్రజలందరూ తమ ఉత్తరప్రత్యుత్తరాలను తెలుగులోనే జరుపుకోవడం.
 • వ్యాప్తి: సాధారణంగా ఉపయోగించే వెబ్‌సైట్లు మరియు కంప్యూటర్ ఉపకరణాలు తెలుగులో అందుబాటులోకి రావడం
 • స్థిరత: రోజువారీగా వాడే సాఫ్టువేరు సాంకేతిక పదాలకు (అందరూ వాడుతుండడం వల్ల) ఓ స్థాయి ప్రామాణికత రావడం
 • విజృంభణ: సగటు తెలుగువారికి అవసరమైన కంప్యూటర్ సంభాషణ అంతా తెలుగులోనే జరుగుతుంది. అన్ని రకాల వెబ్‌సైట్లూ, ఉపకరణాలూ తెలుగులో కూడా లభిస్తాయి.

ఎలా?

విభాగం వివరణ వనరులు
కంప్యూటర్‌లో తెలుగు టైపు చేయడం ఈ రోజుల్లో తెలుగు చాలా సులువుగా టైపు చేయవచ్చు, అందుకు చాలా పరికరాలు/పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. స్వేచ్ఛ ఇన్‌పుట్లేఖిని
పదకోశం పదకోశం స్వేచ్ఛ పదకోశంతెలుగుపదం‌
మొబైళ్ళలో తెలుగు టైపు చేయడం . ఇండిక్ కీబోర్డు
ప్రాజెక్టులు తెలుగు స్థానికరణ లక్ష్యం కోసం చాలా ప్రాజెక్టులు ఉన్నాయి స్వేచ్ఛ స్థానికీకరణ ప్రాజెక్టు

Ranjith Raj Vasam

Simply Me !