సంగ్రహము: పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు

విజ్ఞానం పెంచుకోవాలని ఎవరికి ఉండదు? కానీ ఎంత సమయం వెచ్చించాలి? ఒక సమయం దాటాక ఆ విషయముపై ఆసక్తి కోల్పోయే అవకాశం లేదా సమయం వేచించలేకపోవడం జరుగుతుంటాయి. ఈ అడ్డంకులు విజ్ఞనం పెంచుకోవడానికి కంచె కాకూడదు. వివిధ వ్యక్తులు కలిసి పుస్తక సంగ్రహణ చేసి దాని గురించి చర్చించినప్పుడు విజ్ఞనమే కాకుండా వివిధ అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చును. ఈ ప్రయత్నంలో భాగంగా మొదట మేము ఎంచుకున్న పుస్తకమే "పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు". ఆ పుస్తక సంగ్రహణ...

పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు:

మానవులు అనేక మార్పులకు గురయ్యారు మరియు మార్పులను కొనసాగిస్తారు. మార్పు తప్పనిసరి. మార్పులను అంగీకరించాలి.

పెళ్లి, ప్రశ్నపరంపరలు:

పెళ్లి అంటె ఏమిటి? ఎందుకు పెళ్లి చెసుకోవాలి? ఎందుకు దీనిని వివాహం అని పిలుస్తాము? వివాహం లేకుండా జీవితం సాధ్యం కాదా? ప్రతిఒక్కరికి పెళ్లి అంటె వివిధ నిర్వచనాలు మరియు అభిప్రాయాలు ఉంటాయి. పెళ్లి చేసుకోవడానికి వివిధ కారణాలను చెప్తుంటారు. విభిన్న సంస్కృతులు, వివిధ ఆచారాలతో భిన్నంగా పెళ్లి చేసుకుంటారు. వేరే సంస్కృతికి చెందిన వ్యక్తుల వివాహ విధానం చూసి మనం నవ్వుొకోవచ్చును. వివాహాన్ని అర్ధం చేసుకోవడానికి మనము వివాహం గురించి కలిగి ఉన్న అన్ని నమ్మకాలను మరచిపోయి విషయాలను నిష్కల్మషంగా అంగీకరించాలి.

మగ-ఆడ తెగలు:

ఎందుకు మనం వివాహం చేసుకోవాలి అనేది చలా పెద్ద ప్రస్న? మనుషులు ఈ ప్రస్నకు అనేక కారణాలు ఇస్తారు. వివాహం ఒక పద్ధతిగా మారింది. వివాహం ఉనికికి కారణం ప్రకృతి మరియు సృష్టి. ఈ ప్రకృతిలో పురుషులు మరియు స్త్రీలు ఒకరితొ ఇంకొకరు కలిసి జీవిస్తున్నారు. వివిధ జాతులు ప్రకృతి ఉనికిని కొనసాగించడానికి వేర్వేరు పద్ధతులను కలిగి ఉన్న విధంగా రూపొందించబడ్దాయి. కాబట్టి ఏ జాతుల ఉనికి నుండి తొలగించబడకుండా చలా పద్దతులను పాటిస్తాయి. సెక్స్(జతకూడటం) ఒక జీవ ప్రక్రియ. పెల్లికి దానికి సంబందం లెదు. జతకూడటం పెల్లిని ధ్రువీకరించలేదు. "పెల్లి రెండు మనసులకు సంబందించిన విషయం" అంటుంటారు ఇప్పటి జనాలు అది ఒక పెద్ద భుటకం. అది ఎటీవల మాట. ఆనాటిది కాదు. సమ్మతి లేకుండా వివాహం జరిగిన గతం ఎమవుతుంది? సంతానాన్ని రక్షించడం అనె స్వభావంతో కూడిన నిబంధనను ఈ ప్రకృతి పెట్టింది. అమ్మ ప్రెమ కుద ఈ నిబంధనలలో ఒక్కటే! కాని మనం అమ్మ ప్రేమ గొప్పదని దనిని మించినది లేదని ప్రేమ చూపించని వాల్లు తల్లులు కారని ముద్రలు వేస్తాము. ఈ రోజుల్లో "ప్రేమ" కోసం ఒక స్థానాన్ని సృష్టించాము. అది ఉన్నట్టు ప్రవర్తించదం ఆచరం అయింది. అది లెకపొతే దోషం, ఘొరం అనే అచారం పెట్టబడింది. ఈ రొజుల్లో అందరు ప్రెమ చూపించెవారె!! ఆ రొజుల్లొ ప్రెమ అంటే ఎంటో కుడా తెలియదు. ప్రేమ వివాహన్ని ద్రువీకరించలెదు.

స్త్రీ పురుష సంబంధం:

ప్రక్రుతిలో ఉన్న ప్రతి జంతువు, పక్షి, పురుగు ఆకరికి పువ్వు కుడా జతగూడక తప్పదు. జతగూడటం స్వభావసిద్దం. అన్ని జీవులలానే మనుషులు కూడా జతకూడక తప్పదు. అది ప్రక్రుతి సూత్రం. జతకూడడానికి నియమాలు లేవు. ఇష్టం - అ ఇష్టం, అందం - చందం, ఆచారం - గౌరవం లాంటివి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. జతకూడటానికి ఎంచుకోవడం అనేది ఉండకూడదు. ఆ ఉద్రెకం వచినప్పుడు దేనితోనూ సంభందం లెకుండా జతగూడాలి. సృష్టి ఆరంభంలో ఇలానే ఉండెది. కాని అది సహించలేరు ఈ మడిగుడ్డలు. పైగా మిగిలినవారిని నమ్మించడానికి సిద్దాంతాలుకూడా చెప్పారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా, సాస్త్రవెత్తలు ఒప్పుకున్నా మడిగుడ్డలు మాత్రం అంగీకరించవు. వీళ్ళు ఒప్పుకొకపోయినా పరిసోధన ఆగదుగా. చాలా జాతులలో స్వెచావిహారాన్ని గమనించగలం. చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి. జతకూడటానికి నియమాలు లేవని ఒప్పుకోకతప్పదు. సృష్టి నాటి నుండి నేటిదాకా ఒకేలా లీదు కాబట్టి మన సంఘవ్యవహారల పరిశోధనలో ఇలా భావించకూడదు. విచ్చలవిడిగా బ్రతకడాన్ని అంగీకరించకపోగా పాపంలా చూస్తారు. కాని అప్పటివారికి అది సదాచారం. ఎవ్వరిన కాదు అంటే అనాచారంగా భావించేవారు. స్త్రీ పురుష సంబంధం ప్రక్రుతిలోనే ఉంది, దానిని పెల్లి తెచ్చిపెట్టలెదు. పెళ్ళి లేకపొయినా ప్రపంచం సాగుతుంది, జాతి రక్షించబడుతుంది. స్త్రీ పురుష సంబంధాన్ని నిరోధించడానికి ఎవరో ఎప్పుడో తెచినదే ఈ పెళ్ళి. ఎవ్వరైనా ఎవరితోనైనా జతకూడే అవకాసాన్ని ఆపడానికి పెట్టినదే ఈ పెళ్లి.

పిల్లలకోసమా పెళ్లి?:

తినడం మాదిరిగా జత కట్టటం సాధారణం. రెండు తాత్కాలిక భావాలు,ఆ భావాలు మనల్ని శాశ్వతంగా కలవరపర్చలేవు.కానీ వివాహం లో మనము ఎప్పటికీ కలిసి ఉండాలి. మన సంతానం కొరకు మాత్రమే కలిసి జీవించాలి అంటారు.అనేక పక్షులూ, జంతువులూ వారి సంతానానికి కలిసి ఉంటాయి.ఇది నిజం కావచ్చు.పక్షులలో మగవారు తమ పిల్లలను కొంతకాలం చూసుకుంటారు.కానీ చివరికి ఆడ పక్షులు వారి పిల్లలను చూసుకోవాలి.ఇది వివాహం యొక్క భావన కూడా ఇదే.ఇది హాస్యాస్పదమైనది.మా పెద్దలకు అదే ప్రశ్న అడిగినట్లయితే, వారు అటువంటి అసహజ ప్రశ్నలకు మమ్మల్ని గద్దిస్తారు. వారు చాలాకాలం క్రితం వ్రాసిన మా శాస్త్రాలు యొక్క నియమాలను చూపిస్తారు.వారికి చాలా తక్కువ తెలుసు. తెలుసుకోవడానికి చాలా ఉంది.మగ శిశువు నరకం నుండి తల్లిదండ్రులను రక్షిస్తుందని వారు చెప్తారు.కాబట్టి వారు వివాహం వారు నరకం నుండి తప్పించుకోవడానికి వీలుగా పిల్లలు కలిగి ఉంది అని. మా కుటుంబాన్ని విస్తరించడానికి మేము పిల్లలను కలిగి ఉండాలి.అందుకే వివాహం తప్పనిసరి.చాలాకాలం క్రితం ఒకే తెగ సభ్యులందరూ ఒక కుటుంబం.ఎవరైనా సంతానం కలిగి ఉండవచ్చు, అందుచే వారి కుటుంబం విస్తరించబడింది. కాబట్టి అప్పుడు వివాహం లేదు.ఎందుకు ఇప్పుడు ..? చాలా కాలం క్రితం ప్రజలు వారి సంతానం ఎలా పొందారో తెలియదు.వారికి పిల్లలు సంభోగం కారణంగా జన్మించారని కూడా తెలియదు. ఇప్పుడు కూడా, చాలా వెనుకబడిన తెగలు "ఒక రకమైన గాలి సంతానం యొక్క పుట్టుకకు కారణం" అని నమ్ముతారు. మన పూర్వపు పురాణాల నుండి అనేక సందర్భాల్లో పిల్లలు వివాహం లేకుండా పుట్టారు. కాబట్టి పూర్వ ప్రజలకు సంభోగం కారణంగా పిల్లలు జన్మిస్తారని వారికి తెలియదు. సంతానం యొక్క పుట్టుక మరియు పుట్టుకతో సంబంధం లేదు అని వాదించిన అనేక తెగలు కూడా ఉన్నాయి.కాబట్టి వివాహం మరియు వారి సంతానం మధ్య సంబంధాన్ని మీరు ఎలా సూచిస్తారు.మీరు చాలా కాలం క్రితం పిల్లల కోసం వివాహం వచ్చిందని ఎలా చెప్పగలరు.ఆ మాటలు నమ్మలేనంతగా ఉన్నాయి.

పెళ్ళికి ముందు స్వేచ్ఛ:

ఈ భాగము, మనవుల నడవడికలో పూర్వం జరిగిన ఆడ మరియు మగ జాతులు జతకట్టడం మరియు ఆ ఇరువురి జాతుల స్వేచ్ఛ విదానం గురించి వివరించబడినది. అలా ఆ జతకట్టే స్వేచ్ఛ ను నిరొధించడానికి నియమించినదే ఈ పెళ్ళి. అది, తెలుగు పదజాలంలో అనేక మార్పులను చేకూర్చింది. ఉదహరనకు, రెండు జాతులు జతకట్టాయి అన్నదానికి మరియు పెళ్ళి అనే అంశం ద్వార వేర్పడిన పదజాలం: పెళ్ళాలు, మొగుళ్ళు, స్త్రీ, భార్య వీటి ధోరని మధ్య వ్యత్యాసం చాలనే ఉంది .ఆ పదజాలం లో పుట్టినదే ఈ రంకు జాతి. మరి మనం ఈ రంకు జాతికి చెందినవాల్లమే కదా. ఆడ మగ కలయికల అంతా విచ్చలవిడిగా ఉన్నాయి, కాని కొందరు దానిని నియమలతో కూడిన కలయికగా పిలిచారు. ఆ రోజులలో, విచ్చలవిడిగా జతకట్టడం ఈ జాతులలో కనిపించేది, అదే అప్పటి సమాజ ఆచారం. అనేక జాతులలో ఆడది స్వేచ్ఛగానే జతకదుతూ ఉంది. ఆప్పటి ఆచరం ప్రకారం, పెళ్ళి అయిన తరువాత ఆడది జతకట్టరాదు. కొన్ని ప్రదేశాలల్లో పెళ్ళి అయిన తరువత, విచ్చలవిడిగా తిరెగే ఆచారాలు ఉన్నయి. అదే విదంగ ఇంటికి ఎవరైన వస్తే వారికి అన్ని విధాలుగ సేవ చెయ్యలని కొన్ని జాతులలో ఉంది. పెళ్ళికి ముందు, ఒక జాతి లోని వాల్లు మరొక జాతి వద్దకు వెలతారు దనిని స్వయంవరం అని పిలిచారు. అటువంటి స్వేచ్ఛ విధానం, పెళ్ళికి ముందు మత్రమే కొన్ని ప్రదేశాలలో ఉందేది. అలా ఎన్నో రకల ఆచారాలు ఉన్నాయి. ఏది ఏమైన, పెళ్ళి ముందు వరకు ఆడవారు స్వేచ్ఛగా ఉన్నారు అనేది అక్షరాల నిజం. ఆ ఆచారం లో జతకట్టడం అనేది చాల సాధారణంగా సాగిపోతూ ఉండే పని. ఈ ఉద్దేశంతో పెళ్ళి చెసుకోవడం కుదా లేదు.

ఈగ వాలని రొట్టె:

ప్రస్తుత సమాజం లో ఒక ఆడది ఒక మగవాడు జత కట్టారు అంతే ఒకటి వారు పెళ్లి చేసుకున్నారు అయ్యి ఉండాలి లేదా విచ్చలవిడిగా తిరిగే వారు అయిఉండాలి.సామాజిక మార్పుల వలన పెళ్ళి గౌరవం విచ్చలవిడితనానికి కళంకం ఏర్పడ్డాయి. ఎందరో విజ్ఞానవంతులు,గొప్పవారు,శాస్త్రవేత్తలు మనం అనాగరీకం అని పిలిచే కాల వ్యవహారాల్ని క్షుణ్ణం గా పరిశీలించి విచ్చలవిడితనానికి పెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు అని నిర్దారించారు.కాని ఇప్పటి సంస్కారం మీద అభిమానం కలవారు ఇదొక మెలికపెట్టి మనం అప్పుడు ఇప్పడు ఒకేలా ఉన్నాం అని చెప్పడానికి ప్రయత్నిస్తారు,కాని సత్యం ముందు వారి తర్కం నిలవలేదు.పెళ్లి అనేది అవసరం కాదు ఆచారం,మనం సృష్టించుకున్న ఆచారం.అది మనుషుల మంధ్య సంభందం అనడం కాంటెక్ సమాజం కోసం సంబంధం అంతే బాగుంటుంది.అసలు ఇంతకూ ముందు విచ్చలవిడిగా తిరగడం,జతకట్టడమే ఆచారం,అలా పిల్లలను కనడం తప్పు కాదు పిల్లిచేసుకోడానికి అడ్డం కాదు.పైగా ఆలా పెళ్ళికి ముందే పిల్లలు ఉండడం అనేది గొప్ప,ఒక అర్హత,ఒక గౌరవం కూడాను. ఎవ్వరు కూడా పెళ్ళి అయ్యాకే జతకట్టాలి అన్న ఆలోచన లో ఉండేవారు కాదు.ఒకవేళ ఉంది అలా ఎవరైనా ఉండి ఉంటె వారికి తిప్పలు తప్పవు,వారిలో ఏదో లోపం ఉన్నట్టే పరిగణించేవారు.పరిగణించేవారు.మనం ఇప్పడు ఉంటున్నట్టు వారిని ఉండమని హితబోధ చేసి ఆడవారు పెళ్లి ముందు కన్యగానే ఉండాలి అంటే వారు ఏమంటారో తెలుసా..?"ఒక్క ఈగ ఐన వాలని రొట్టె అసలు ఒక రొట్టేనా..?" అది మంచి రొట్టె ఐటీఐ ఒక్క ఈగ ఐన వలాలి కదా! లేదంటే రొట్టెలో లోపం ఉండాలి.అమ్మాయి అందంగా ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నాం అనేవారు ఉన్నారు మన సమాజంలో.ఇంతకూ ముందు అందం చూసి పెళ్ళి అనే మాటే లేదు.అవసరం కోసం కలిసి ఉండేవారు.ఇంటి పనులలో సహాయం కోసం ఆడవారితో కలిసి ఉండేవారు,కండ బలం ఉంది పనులు చేయగలిగిన మగవారితో ఆడవారు కలిసి ఉండేవారు.ఇప్పుడు పొలం పని కోసం గొడ్లని తెచ్చుకున్నారు,అప్పుడు మనుషులని తెచ్చుకునేవారు తేడా ఏమి లేదు.కాబట్టి అందం చూసి పెళ్లి చేసుకున్నాం అనే వాదానికి బలమే లేదు.కాల ప్రయాణంలో మొదట శారీరిక అవసరం కోసం మొదలు ఐన పెళ్లి రోజువారీ అవసరానికి తగ్గట్టు మార్పు చెందింది అంతే.

తోడి పెళ్ళికొడుకు:

ఇప్పటి దాకా పెళ్లి ఎలా ఆవిర్భవించింది,అప్పటి ఇప్పటి పెళ్లి కి తేడాలు చూసాం.ఇప్పుడు కాల గమనంలో మారిన కొన్ని పద్ధతులు చూద్దాం.పూర్వం కాలంలో జత కట్టడానికి వావి వరసలు ఉండేవి కాదు.మన శాస్త్రాలలో కూడా వావి వరసలు లేని జతకట్టడాలు చాలానే ఉన్నాయి.చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి తర్వాత ఇతరులతో జతకట్టడానికి బయతరాలు వ్యక్తం అయ్యాయి.ఆఅహ్ విధంగా పెళ్ళి తరువాత విచ్చలవిడితనం తగ్గింది.కాని ఇలా జరగడం వల్ల తక్కినవారు జతకట్టేయ్ హక్కుకు భంగం కలిగింది.ఈ తక్కినవారు అంగీకారం కొరకే అప్పటిలో ఒక చోట విందులు ఏర్పాటు చేసేవారు,ఇంకొక చోట పెళ్లి అయిపోయిన మొదటి రాత్రి పెళ్లికొడుకుతో కాకుండా వేరేయ్ వారితో గడపాలి.కొన్ని తెగలలో తెగ పెద్దతో గాని,తెగ చూపించిన వాడితో గడపాలి.తరవాత ఆ పెద్ద(తెగ చూపించిన వేరేవారు) పెళ్లికూతుర్ని పెళ్లికొడుక్కి అప్పగించేవారు.ఈయన్నే మనం ఇపుడు తోడుపెల్లికొడుకు గా అభివర్ణిస్తున్నాం.ఇప్పుడు కూడా ఈ పెళ్లికొడుకుగా పెళ్ళికూతురికి వరస అయ్యే వారినే కూర్చేపెడుతుంటారు.కాని కాల గమనంలో ఈ పెళ్లి పెద్ద కాస్త వినోదం కోసం ఆచారవ్యవహారంలో ఒక భాగం అయిపోయాడు.అందుకే చాలా తెగలలో,చాలా పెళ్లిళ్లలో తోడుపెల్లికొడుక్కి పెళ్ళి అయ్యేంత వరకు ఎక్కువ గౌరవం ఇస్తారు(పెళ్లి బోజనాలలో ముందు వడ్డించడం,పల్లకి మొదట ఎక్కించడం,కట్నం మొదట చదివించడం). దీన్ని బట్టి మనకి బాగా అర్ధం అయింది ఏంటి అంటే మన అవసరాలకు తగ్గట్టుగా పెల్లియొక్క ఆచార వ్యవహారాలు మారు చేసుకుంటూ వచ్చాము.

మేనరికాలు హాస్యాలు:

మొట్ట మొదట విచ్చలవిడిగా జతకట్టే పద్దతి రాను రాను కొన్ని నియమాలకు కట్టుపడవలసి వచ్చింది.ఈ వ్యక్తితో జత కట్టరాదు,ఆ వ్యక్తితో జత కట్టరాదు నిషేధాలు కలిగాయి.కొన్ని తెగలలో ఒకే తేగల వారు జతకట్టకూడదు,కొన్ని తెగలలో ఓకె తెగ వారు మాత్రమే జత కట్టాలి ఇలా చాలా నిబందనలు వచ్చాయి.ఇలాంటి నిబంధనలలో ఒకటి ఒక కుటుంబంలో ఒకరికి పెళ్లికి అయింది అంటే ఆ కుటుంబంలో అందరితో జతకట్టవచ్చును.అది వారి హక్కు.ఒక ఇంటిలో ఒకడు పెళ్ళి చేసుకున్నాడు అంటే ఆఅహ్ ఇంట్లో అందరు ఆమెతో జతకట్టవచ్చు,అదే విదంగా ఒక అమ్మాయి ఒకడిని పెళ్లి చేసుకుంది అంటే తన అక్క చెల్లెళ్ళు అందరు పెళ్లి కొడుకుతో జతకట్టవచ్చు.మన పురానాళ్ళూ పాండవులు చేసింది ఇదే.వాలి సుగ్రీవులు చేసింది కూడా ఇదే.వాలి భార్య అయిన తారా ఇద్దరికీ భార్యనే..ఈ వాదాన్ని బలపరిచే ఉదాహరణలు చాల కనిపిస్తుంటాయి.వినడానికి ఇబ్బందిగా ఉన్న ఈ పద్దతియొక్క వాసనా ఇంకా మనదగ్గర ఉంది.బావ మరదలు,మావయ్య మేనకోడలు సరసాలు ఇందుకు పెద్ద ఉదాహరణ.ఈ విచ్చలవిడితనాన్ని అంగీకరించలేనివారు కూడా ఈ బావ మరదలు బంధుత్వాన్ని అంగీకరించారు.ఈ బావ మరదళ్ళు పెళ్ళి చేసుకున్న చేసుకోకపోయినా ఇష్టం వచ్చినట్టు సరసాలు ఆడుకున్న విని అయ్యో ఇలా ప్రవర్తించడం టాపు అనేవారు ఎవరైనా ఉన్నారా..?లేదు పైపెచ్చు వారిద్దరు బావ మరదళ్ళు వారికి ఆ అధికారం ఉంది అని అనేవారు,వారి మాటల్ని విని నవ్వుకునేవారు,ఆనందించేవారు ఎక్కువ.

అక్క మగడు అందరికి మగడే :

ఆ కాలంలో అక్క మగడు అందరికి మగడే.అక్కని పెళ్లి చేసుకుంటేయ్ చాలు చెల్లెళ్లను వేరుగా పెళ్లి చేసుకొనవసరం లేదు.అదెయ్ విధంగా అన్నని పెళ్లి చేసుకుంటే చాలు తమ్ముళ్ళని వేరుగా పెళ్లిచేసుకొనవసరం లేదు.స్వేచ్ఛగా జతకట్టవచ్చు,కలసి ఉండవచ్చు.ఒక అమ్మాయికి పెళ్లి అయింది అంటే తనని ఆ ఇంటికి కోడలిగా అభివర్ణిస్తారు.కోడలు అనే పదానికి చాలా రూపాంతరాలు ఉన్నాయి.కూడల్ అనే పదం కాల గమనంలో రూపాంతరం చెంది కోడలుగా మారింది.కూడల్ అంటే సంఘానికి చెందింది అని అర్ధం.ఇక్కడ ఆ ఇంటికి చెందింది అని అర్ధం.ఆ ఇంటిలో ఎవరితో అయిన జతకట్టవచ్చు కాబట్టియు ఆమెని కోడలుగా పిలుస్తారు.ఇప్పటికీ చాలా తెగలలో భార్య చనిపోతే ఆమెకి చెల్లెళ్ళు ఉంటే వారిలో ఒకరిని తప్పకుండా పెళ్లిచేసుకోవాలి.సమయానికి మనుషుల స్వార్దానికి మన అవసరాలకు తగ్గట్టు దీన్ని కూడా మార్పులకి గురిచేసాము.ఇప్పుడు కూడా చాలా చోట్ల బార్య చనిపోయినప్పుడు ఆమెకి చెల్లెళ్ళు ఉంటే వారిని పెళ్ళిచేసుకోవడం చూస్తూంటాము.కానీ భర్త చనిపోతే అతని తమ్ముడిని పెళ్లి చేసుకునే భార్యలను నిషేధించాం.అడిగితేయ్ మరిది కొడుకు లాంటి వాడు అంటాం.

నిషేదాలే నిదర్శనలు:

ఈ భాగంలో, వివిధ రకాల ఆచారాలలో కలిగి ఉన్న పెళ్ళిళ్ళ బంధాలను వివరించ బడినది. అటువంటి బంధాలలో, అన్న భార్య చనిపోతె వాల్ల తమ్ముడు పెల్లి చేసుకొవటం, అక్క మొగుడు చనిపోతె అతనను వాల్ల చెల్లి పెల్లిచేసుకోవడం జరిగేది. మన భారత పురాణాలలో ఇటువంటి ఆచారలు అమలులో ఉన్నట్లు తెలుస్తుంది. ఉదాహరనకు: బ్రిటిషు, కొలంబియా, ఆఫ్రికా వంటి దేశాలలో ఆలంటి ఆచారాలు అనేకం. మన దగ్గర మేనరికం వంటి సంబందాలు లాగా ఉన్నవి. ఆఫ్రికాలో ఒకడు చనిపొయిన తరువాత అతని భార్యను అతని కొడుకు పెళ్ళి చేసుకోవచ్చును. అదే విదంగా,ఫ్రెంచి గయానాలో ఒక ఆడది రెండో పెళ్ళి చెసుకొని ఒక కూతురు కూడా ఉంటె వాల్లిద్దరికి పెల్లికొడుకు ఒకడే అవుతాడు. అయితే, ఇలాంటి సంబందాలు కెవలం పెళ్ళి లొ తప్ప జతకత్తడంలో లేదు. కొన్ని దేశాలలో, విచ్చలవిడిగా జతకట్టడం తప్పెలేదు, మరియు అలనే మొదటలో జరిగేదని అంగికరించారు. ఆ స్వేచ్ఛను తప్పుబట్టే వాళ్ళని పీక పిసికి చంపేసెవాళ్ళు.

పడుచువారికి ముసలిజంటలు:

ఇందులో, మనకున్న పెళ్ళి రకాలను, వాటి అంతర్గతాలను, మరియు అవకాశం కోసం పెళ్ళిళ్ళు వంటి అంశాలను చర్చించబడినది. పెళ్ళికి మొదటి కారణం ఉపయోగం తరువాత సహాయం ఇంక మిగిలినవి. తోడు కోసం జరిగే పెళ్ళిళ్ళు, పని పాటులు చెసుకోవడంలో తోడ్పడడానికి చెసుకున్న ఒక యేర్పాటు. అదేవిదంగా, ఈ పిళ్ళిళ్ళు, చేసుకునేవారికి సంబందం లేకుండానే జరుగుతున్నాయి. చివరిగా, గుణాల దగ్గర అందానికి స్థలం ఉండదు. గుణాలు అనగా, పనిపాట్లు, చదువు సంధ్యలు అని మరికొన్ని ఉన్నవి.

పరిణయమంటే?:

ఈ భాగంలో అనేక రకముల పిళ్ళి వ్యవహారాలు గురించి వివరించబడినది. పెళ్ళికి మొదటి కారణం అవసరం, 'జతకట్టి కామం' తీర్చుకోడానికి అవసరం కాదు. అది యెధేచ్చగా ఎల్లప్పుడు లభించేదె. గర్భసంచి అవసరం అనేది బహుశా పిళ్ళి కొరకు ముఖ్యమైనది ఎమో. ఇక్కడ నుంచే బానిసత్వం అనేది మొదలైంది అనుకోవచ్చు. ఆ గర్భం దాల్చిన సమయంలో మగవాడు ఆడదానిని బానిసలుగా కట్టిపడేశారు. అధికారాలన్ని మగవారివని, మిగిలిన ఇంటి చాకిరి అంతా ఆడదానిదని నీతులు చెప్పడం కొనసాగించారు. ఇంకొందరు, ఆడవారంటే, బలహీనంగ ఉంటారని, బుద్ధి, ధైర్యం ఇలంతివి ఉండవని ఇంక ఎన్నెన్నో కారణాలతో చంపుతున్నారు.
ఇంకా చూస్తె, మగవాడు అందం నాజూకు అన్న పేరులతో మహద్రోహం చేసాడు. నిజానికి ఎన్నో జాటులలో అలా అందం నాజుకు తేదా లెకుండానే ఉన్నారు. ఇది ఎలా మరింది అంటే,ఆడదాన్ని ఇనుప సంకెల్లతో బిగించినంతవరకు పొయింది.
అదేవిందంగా ఆడదాన్ని కొనుగొలు చేసెదాక పొయింది మన నాగరికథ. ఇప్పుదు కట్నాలు అన్న ఆచారానికి, ఆ కొనుగూలు ఆచారమే మూలం. కావున, ఈ తీసుకుపొయె ఎవారలు లేక ఆచరాలలో పని కబట్టె దీనిని 'పరిణయం' అన్నారు.

చిత్రమైన పెళ్ళిళ్ళు:

ఈ భాగములో కొన్ని చిత్ర విచిత్ర మైన పెళ్ళిళ్ళ గురించి వివరించ బడినది. మొదటిది: ఈ విచిత్రం స్యుగినీలో ఉంది. పెళ్ళి రాయభారాలు రెందు కుతుంభాలు మధ్య జరుగుతయి. అయితే, జంతువులని ఆడవల్లు దండయాత్ర చేసి తీసుకెల్తారు. అల దండయాత్ర కి వస్తున్న విషయం అందరికి తెలిసినదె. పెళ్ళికొడుకు పెళ్ళికూతురూ ఒకరి వీపు ఒకరికి తగులుతూ ఉన్నట్లు తూర్పు పడమరకు ముఖాలు పెట్టి కూర్చుంటారు. పెళ్ళికొడుకు తమలాపాకు నములుతాడు లెద చుట్ట కాలుస్తాడు. దానితో మూడు ముడులు పడినట్టే. ఆఫ్రికలో పిల్లలు లేకపోవడం అనేది ఒక దోషం అని ఉంది. అల మరికొన్ని చిత్రలు ఉన్నాయి. ఈ పెళ్ళి బందాలు గాని, జతకట్టడం కాని, నాగరికతకు అనుకూలంగాలెవు. దొరికిన సమయములో, పలు పనులను తగవు అన్నరు ఆనాటి పెద్దలు. ఆ రూపేన, పెళ్ళి అయిన తరువాత వ్యభిచారం ధోషం అన్నరు.

మచ్చు పెళ్ళిళ్ళు:

ఇందులో, ఒక పెళ్ళి అవ్వడానికి ఎన్నొరకాలుగ ఆడదానిని పరీక్షించే విధానాలను వివరించారు. ఆ పరీక్షించే ఆచారాలు బహు విచిత్రంగా ఉంటాయి. మగవాడి అర్హతలు బలంతో కూడిఉండేవి. ఆడడి ఎన్నొ అర్హతలను చూపాలి. ఇంటిపనులు మొదలు, పిల్లలను కనగలిగిన అర్హత కూడా ఉండాలి. కొన్ని జాతులలో సంతానం కలిగే వరకు జరిగిన పెళ్ళిని పెళ్ళిగా లెక్కచెయ్యరు. అలా నాజూకుగా ఆడదానిని లెక్కించటం, బల పరీక్ష తరువత, తెలివితేట పరిక్షలు చేయటం ఆరంభించారు. ఇలాంటి పరీక్షలు అనేకం. ఎల్లకాలం ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరీక్షలు, మన ముత్తాతల కాలం ఆచారాల దౌర్జన్యాల దగ్గరికి అయితె పోలెదు.

తాళి - గాజులు:

పొరాటం చేసి సాధించి తెచ్చుకున్నదానికి "హక్కు" వుంటుంది "ఇది నాది" అని. అది అందరకి తెలియడానికి, సంకెల్లు వెయవచ్చు, మెడలొ ఒక దండ వెయవచ్చు. జగ్రత్తగా తెలుసుకుని అర్ధంచేసుకుంటే పెల్లి తంతులొ ఈ విషయం బోధపడుతుంది . మంగళసుత్రం (మెడలొ దండ వెయడం , చేతికి గుడ్డ కట్టడం) గాజులు (సంకెల్లు) ఇవ్వన్ని అ హక్కుని చుపించేవె. కాబట్టి పెళ్ళి తంతు వెనకాల పరమార్ధం ఎం లేదు ఇది కేవలం మగాడికి తానూ సాధించి తెచ్చుకున్న హక్కు బాహాటంగా తెలుపుకునే ప్రక్రియ మాత్రమే. కాబట్టి "పెళ్ళీ" అన్న దానికి విలువ ఇవ్వగలిగే అర్ధం కానీ పవిత్రత కానీ లేదు.

ముసుగులో ముచ్చట్లు:

వధూ వరులకు నచ్చితేనే పెళ్లి జరిగేది లేకపోతే కథ అంతటితో ఆగిపోతుంది.పెళ్లి అయ్యాక కూడా నచినంత సేపే కలిసి ఉంటారు నచ్చకపోతే భార్యలను బదిలీ చేసుకోవచ్చు. ఇ లాంటి అవకాశాలు ఉన్న పెళ్లికి ముందు ఒకరిని ఒకరు తెల్సుకోవడం మంచిది అనుకునేవారు.అప్పటిలో ఆడ మగ కలిసి తిరిగేవారు జాతకుడేవరు.ఈ కాలంలో ఎంత తిరిగిన జతకుడడం తప్పు వద్దు అంటారు.ఆ కాలం అంత ఖాలి సమయం దొరికేది కాదు, ఇల్లంతా జనం.రాత్రి అవ్వగానే పెళ్ళికొడుకు ఇంటికి వచ్చి పాట పడతాడు. తండ్రి ఎవరిని అడిగితే పేరు చేపటాడు. పెళ్ళికూతురు కి నచ్చితే నిప్పు ఉదమ్మాయి అంటాడు.పెళ్ళికొడుకు లోపలికి వస్తాడు. ఇద్దరూ ముసుగులో దూరిపోతారు.నచ్చకపోతే అసలు రదనికే వీలు ఉండదు.ఒకసారి జరిగింది కదా అని పెళ్లి కుదరదు. కొంత కాలం ముచ్చట్లు కొనసాగితే నే పెళ్లి కుదురుతుంది.ముచ్చట్లు కొనసాగే అంత కాలం ఆడది రేపు మళ్ళీ రా అని చెప్పాలి అప్డే రేపు వస్తాడు లేకపోతే కథ సమాప్తం.పెళ్లి జరగాలి అని అనుకునే ఆడవాళ్ళు రాత్రి భోజనం అయ్యాక ఒక కొట్టం లోకి చేరుకుంటారు.మగవాళ్ళు అంతా కలిసి బయట కూర్చునేవారు. ఒకరు లోపలికి వచ్చి వచ్చిన వాళ్ళ పేర్లు చెపితే ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకొని ఆడవాళ్ళు లోపలికి వెళ్ళేవారు. మిగితా మగవాళ్ళు ఇంటికి పోవాల్సిందే. ఆ రాత్రి అయ్యాక పొద్దున ఇంటికి వెళ్లాల్సిందే. ఆడది మళ్ళీ రేపు రా అని చెప్పాలి లేకపోతే రాకూడదు. రేపు మళ్ళీ వచ్చిన ఆడది ఆ మగవాడిని ఎంచుకోకుడదు. రేపు రా అని ఎప్పుడు ఆడదాని నోతినుంచే రావాలి. మగవాడు రేపు వస్తాను అని అనకూడదు. అలా చెపితే చిన్నతనం, పరువు పోతుంది.

ఒక్కసారి మననం:

జతకట్టడం, ఆకలి ఒక్కటే బుద్ది పుడితే చెయ్యాలి. మునుప జాతకట్టడానికి అడ్డు అదుపు ఉండేవి కాదు కానీ కాలం సాగెకొద్ది మనుషులు మందలుగా ఉండటం మొదలుపెట్టారు. గుడాలుగా ఉన్న ప్రజలు ఒకే చుట్టరికం ఉన్నవారయ్యారు. అప్పుడు ఇల్లుసాయం అనే అవసరం ఏర్పడింది. 'ఇది నా సొంతం' అనే భావం మొదలైంది. ఇల్లు చూసుకోవడానికి ఆడది అవసరమైంది. ఇదే పెళ్లికి ఆరంభం. గుడాలు మధ్య పోట్లాట జరిగినప్పుడు గెలిచినవారు ఓడినా గుడం దగ్గరనుండి ఆస్తిపాస్తులతో పాటు ఆడవాళ్ళని కూడా చెజిక్కించుకునేవారు. ఈ ఆడవాళ్ళని పనికి మరియు జతకట్టడానికి ఉపయోగించేవారు. మొట్టమొదటిగా ఇదే పెళ్లి అని చెప్పవచ్చును. ఒక్క ఆడది ఇంటి చాకిరి మొత్తం చేస్తుంది. అంతేగాని జతకట్టడానికి ఈ పెళ్లి లేదు పైగా అంత ప్రాకులాడే అవసరములేదు, వారికి జాతకట్టే స్వేచ్ఛ ఉండేది. అప్పుడు కావాల్సినదంతా ఇంటిపని కాబట్టి దానికి అనుకూలంగా వుండే ఆడవాళ్ళని తెచుకునేవారు. కొన్నాళ్ల తర్వాత గూడెంతో గూడెం పొట్లాటలు మరియు ఆడవాళ్ళని పట్టుకొని తేవటం తగ్గింది. తండ్రి దగ్గర పెరుగుతున్న లేదా గూడెంలో ఉంటన్న ఆడవాళ్ళని కావాల్సిన వారు కొంత ధనం (ఆ రోజులకి తగ్గది) ఇచ్చి తెచుకునేవారు. ఈ లావాదేవీ ఎవరికి నచకపోయినా ఇచ్చిన ధనం వాపసు ఇచ్చి ఆడదాన్ని తిరిగి తెచుకోవచ్చును. ఏ సంబంధము శాశ్వతం కాదు. దీని బట్టి ఒక విషయం అర్థం అవుతుంది. పెళ్లి అనేది సృష్టికి కావాల్సిన ఆవశ్యకత కాదు, సృష్టికి జతకట్టడం ఆవశ్యకత. పెళ్లి ఒక వ్యక్తి స్వేచ్చకు విరుద్ధం.

శవ వివాహాలు:

పెళ్ళి అనే ఆచారం ఆరంభం అయింది, అభివృద్ధి చెందింది. ఈ ఆచారాన్ని జరుపుకుంటూ ఒక వయసు వచ్చాక ఎలాగైనా సరే జరగాలి లేకపోతే పాపం, నరకానికి వెళతారు అని అనేవారు‌. పెళ్లిని ఎంతలా నమ్మేవారు అంటే పెళ్లి జరగలేదు అంటే సిగ్గుగా భావించేవారు. మగవాడు అయితే అర్హత లేదు, ఈ అప్రపయౌజకుడు, అసమర్థుడు అని అనుకుంటారు అని సిగ్గు. ఆడది అయితే పని దొంగ, మొద్దు అని అంటారు అని సిగ్గు.బాల్యం,యవ్వనం ఎలా వస్తుందో అలాగే పెళ్లి కూడా చేసుకోవాలి అని అనేవారు. పెళ్ళి కాకుండా చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళకి పెళ్లి జారకుండా చనిపోయారు అని బాధపడేవారు. పాపం చుట్టు కుంటుంది అని అనుకునేవారు. అలా చనిపోయిన పిల్లలకు శవ వివాహాలు జరిపేవారు. ఇప్పుడు ఒక అమ్మాయి చనిపొతే ఎప్పుడో చనిపోయిన అబ్బాయికి పెళ్లి నిశ్చితార్థం జరిగేది.ఇరువైపుల వాళ్ళు తాంబూలాలు, లాంఛనాలు ఇచ్చిపుచ్చుకునేవారు. ఒక వేడుకగా బాగా జరుపుకునేవారు. మగపెళ్ళి వారు ఆడపెళ్ళివారు పురోహితుడు తో శివాలయానికి వెళ్లేవారు. అమ్మా యి సమాధి దగ్గర అబ్బాయి సమాధి దగ్గర పీటలు వేసి జెండా పెట్టి పెళ్లికి ఆహ్వానించేవారు.జెండా ఎగిరితే వాళ్ళకి ఇష్టమే అని పెళ్లి చేసేసారు.బ్రతికి ఉన్న వాళ్ళ లాగే పెళ్ళి జరిపించేవారు. అంతా అయ్యాక పెళ్ళి పత్రాలు అగ్నిలో పడేసేవారు. ఇంటికి వెళ్ళి విందు భోజనం చేసుకోని ఆనంద పడేవారు. ఆ కుటుంబాల సంభందాలు బలపడేవి. సంవత్సరం అంతా కలిసి అన్ని ఆచారాలు, పండుగలు జరుపుకునేవారు. ఇలా శవ వివాహాలు జరిపి పురోహితులు బాగా సంపాదించే వారు.

బాల్యవివాహాలు:

పెళ్ళి ఒక మొక్కుబడిగా తయారైంది.చనిపోయిన వారికి కూడా పెళ్లి జరిపించేవారు ఆలా చేయడం కంటే బ్రతికుండగా చేయడం మంచిదని ఆలోచనతో బాల్యవివాహాలు మొదలయ్యాయి.పుట్టిన పిల్లలకి పెళ్లిళ్లు,చిన్న పిల్లలకి ముసలివాడివడితోనూ పెళ్ళిళ్ళు జరిపించేవారు.ఒకవేళ అతను చనిపోతే తాను ఇంకొకరిని పెళ్లి చేసుకునేది.ఆరోజుల్లో దానిని తప్పుగా చూసేవాళ్లు కాదు-అలానే చేయాలి గుడాను.పెళ్లి అనేది ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ ఇంటి అమ్మాయికి పెళ్ళి చేయకపోతే వాళ్ళని చేతకాని వాళ్ళలాగా చూసేవాళ్ళు,వాళ్ళ ఇంటికి వెళ్లడానికి కానీ భోజనం చేయడానికి కానీ వెళ్ళే వాళ్ళు కాదు.ఊరికి ఎడినా చెడు జరిగితే దానికి వాళ్లనే కారణంగా చూయించేవారు,బాల్యవివాహాలు ఇలానే వ్యాప్తిలోకి వచ్చాయి కానీ ఇంకొకలాగా కాదు.

పాతీవ్రత్యం:

ఆడవారికి పెళ్లికి ముందు ఉన్న స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదు. మొదట శత్రువుతో పొట్లాడి ఓడించి పశువులతో పాటు ఆడవాళ్ళని కూడా తెచుకునేవారు అలాగే పశువులలా ఆడవాళ్ళని కూడా వస్తువులలాగా స్వతంత్రత లేనివారుగా లెక్కించేవారు. తరువాత మంచితనంతో చేసుకునే పెళ్లిళ్లు వచ్చాయి, వాటిలో మారుబేరం జరిగేది. కావున అర్థం అయ్యే విషయం ఏమిటంటే ఆడవారికి అధికారం లేదు. ఈ విషయం వాళ్ళకి తెలియటానికి కాళ్ళకి చేతులకి గొలుసులు, మెడకు తాడు వేసి ఈడ్చేవారు. తనకు లేని అధికారాన్ని చూపించేవాడు మగవాడు. సమానస్థాయిలో ఉన్న ఆడవారిని బానిసగా మార్చాడు. పెళ్లి తరువాత చాలా నిబంధనలు పెట్టేవాడు, హీనంగా చూసేవాడు. స్త్రీకి గర్భధారణం, ప్రసవం, చంటిబిడ్డ అనే సహజమైన ప్రతిబందకాలున్నాయి కదా అందువల్ల కొంత ఆయాసం, అస్వాధీనత కలుగుతాయి. అందువల్ల ఇతరుల మీద కొంత ఆధారపడక తప్పదు. దీనిని పెద్ద సాకుగా చేసి తానే అధికారిని అన్నాడు మగవాడు. అందులోనూ దూరాభారం పోయేవాడు, కత్తి కొయ్య పట్టుకుని పోరాడేవాడు, అట్టహాసాలు చేసేవాడు మగవాడె అయ్యాడు అందువల్ల మగవాడు గొప్ప అని స్థిరపరచుకున్నాడు. అక్కడినుండి తనకు వీలు ఉన్నట్టు సూత్రాలు, నియమాలు పెట్టి దానినే పాతివ్రత్యం అన్నాడు. పాతివ్రత్యంకు గొప్ప స్థానం ఇచ్చి పురాణాలు, కట్టుకథలు అల్లాడు. ఆడది కూడా అదే మహాభాగ్యం అనుకుని తన జీవితానంతటిని ధారపోసింది. కానీ పాతివ్రత్యం మాత్రం మగవాడికి ఆడదానిని అదుపులో పెట్టుకోవడానికి పనిచేసిన ఉపాయం కాని గౌరవం కాదు. పాతివ్రత్యం గొప్పదని మగవాడు అనుకుని ఉంటే అతిధి సత్కారంలో ఆడవారిని అతిధితో జాతకట్టడానికి ఎందుకు పంపేవాడు? అది పాతివ్రత్యంకు భంగం కాదా? భార్యలను మార్పిడి చేసుకుని పతివ్రతా లక్షణం అనేవారు. ఇది ఒప్పుకొని ఆడవారిని పాతకిగా లిఖించేవారు, పవిత్రత లేదనేవారు. ఆడవాళ్ళని వారి ఉపయోగం కోసం కట్టుసంకెళ్లలో పెట్టడానికి ఆనాడు మగవాళ్ళు చేసిన పన్నాగం ఇదంతా!!

కీడు తీయడం అంటే?:

పురుషుని అహంకారం మరియు ఆడవారి మీద పెత్తనం గురించి చెప్పారు. పురుషునికి స్వేచ్ఛ కావాలి కాని అదే స్వేచ్ఛ ఆడవారి కి ఉంద కూడదని ఒక మొగుడయ్యి ప్రురుషుడు ఆలోచిస్తాడు. ఒకప్పుడు అడివి ప్రపంచం లో పిల్లల్ని చూసుకొని ఇంటికి రాజు లాగా వేలింది ఆడ వారే ఇప్పుడు సాంప్రదాయం పేరు తో భార్యని ఇల్లాల్ని చేసి పురుషుడు ఇంటికి రాజు అయ్యాడు. పురుషుని ఆధిపత్య ప్రయత్నాల లో భాగంగా ఆడవారికి కన్యత్వం ఉందాలనే ఆంక్ష పెట్టాడు. ఆడదానికి ఆశ్రయించి చాలా భూతాలున్తాయి ఆ భూతాలన్ని తొలగంచదాన్ని కీడు తీయడం అంటారు దాని లో భాగం గా చెట్టు తో పెళ్లి శోభనం జరిపించటం లాంటి విచిత్ర పనులు చేయించే వాళ్లు ఈ నమ్మకాలు ఇప్పటి దాకా సాగుతూనే వస్తున్నాయి. మరీ అన్యాయంగా ఒక ఆడదానికి భూతాలు తొలగించదానికి పెద్దవాళ్లు మొదటి శోభనం చేసే వాళ్లు పెద్దవాళ్లు అనగా రాజులు, ఆచార్యులు, భ్రాహ్మనులు అనే కుల వ్యవస్త లో పైన ఉన్న వాళ్లు తాకిన తరువాత భూతాలు వెళ్లిపోయాయంత. దీనిని కీడు తీయటం అంటారు.కీడు తీయిస్తే అమ్మాయికి దోషాలు పోతవి అని నమ్మించే వాళ్లు. ఈ విచిత్రాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అగ్ర జాతి మహానుభావుల కామ ధాహానికి ఆడవారు బలి అయ్యేవారు. తరువాయి కాలం లో ప్రథమ హక్కు తనది ఉందాలని పురుషుడు అనుకొని వుంటాదు. అందుకే కన్య కావాలి అని బిగదీసి కూర్చున్నాడు అందుకే కన్యత్వ పరిక్ష కుడా చేయించేవారు.

పిల్లెళ్ళు ఉంగరాలు:

దేశం తిరిగిన మనిషి దారి తప్పిన అలొచనల్లొ "ఇది నాది " అని అనుకొవడం ఒకటి, స్వార్ధం స్వేచ్చను హరిస్త్థుంది, అందుకు పెళ్లి బాగ పనికొచ్చింది. నలుగురిని పిలిచి "ఇది నా భార్య", "నువ్వు నా దానివి " అని చెప్పటం కొసం పెళ్లి తంతు వచ్చింది , పాణి గ్రహణం దగ్గర నుంచి కాలికి మెట్టలు తొడిగేదాక "ఇది నా భర్య" అన్న సూచనలు స్పష్టం చేసేవే. టమకు వేసి అవుని, ఏదొ ఒక వస్తువుని గాని ఇంట్లొ తెచ్చుకోవడం అన్నట్లుగా , వచ్చిన వాల్లందరిని "నా భర్య" అని నమ్మించడమే అ పెల్లి తంతుల ముఖ్య ఉద్దేశం, ఉంగరం చెతికి తొడిగతె ఎం? మెట్టె కాలికి పెడితె ఏం? నాది అని చెప్పుకునెందుకు చిహ్నలే ఇవ్వన్ని. అందానికి మెలి ముసుగు తొడిగినవే ఈ చిహ్నలు అన్ని, అశ్లీలం అన్న భూతాన్ని తయారుచేసినవి ఈ పద్ధతులే!

పెళ్ళిలో పురోహితుడు:

వలపు, మొహం ,కామం. పేరు ఏదేయినా పరస్పర లబ్ది జతకూడడమే, అదే మొదట్నుంచి లక్ష్యం. పెద్దలతొ మాట్లాడి, వ్యవహారాలు కుదుర్చుకుని జతకూడినవాళ్లు (పెళ్లి) కొంతమంది. ఒప్పుకోకపోతే పారిపోయి జతకూడినవాళ్లు కొంతమంది. ఇద్దరి మధ్యన ప్రకృతి జరిపే సహజ క్రియలో వచ్చిన మూడో వ్యక్తి పేరు "పురోహితుడు". మగాడి అధికారాన్ని తెలిసి తెలియని మంత్రాల ద్వారా రుద్ది ఇద్దరి మద్యన సమానత్వాన్ని ఒకరి సొత్తుగా మార్చిన మనిషి మరెవెరో కాదు పురోహితుడే! సహజంగా ఏర్పడే కోరికలోకి మతాన్ని దూర్చి కట్టుబాట్లని, శాపం అనే భయాన్ని, మగాడు గొప్ప అనే అర్ధంలేని బోధన నరాల్లో నింపి కుటుంబాల మధ్య దూరాన్ని, దుఃఖాన్ని తీసుకువచ్చి పడుపువృత్తికి మొదట ఇటుక దానం చేసిన వారే "పురోహితుడు".

ఏకులే మేకలు:

ఒక మగవాడికి పశువులను కాయడానికి, వంట చేసి పెట్టడానికి ఒక ఆడది కావాల్సివచింది దానినే భార్య అన్నాడు. ఆ భార్య కోసం ఆడదాని తండ్రితో బేరమాడుకుంటాడు, బేరం షరతులు జరిగినంతకాలం వీరిద్దరూ ఆలమగలు లేదా ఎవరి దారి వారిదే. ఇలాంటి పెళ్లిలో పురోహితుడికి జాగా లేదు. పిలవని పేరంటంగా వచ్చి పెళ్లి తంతులోని స్థిరపడిపోయాడు. తాను లేకపోతే ఆ పెళ్లి చెల్లదన్నాడు అసాధ్యుడు. ఈ పేరిట చాలా ఘోరమైన పెళ్లిళ్లు చేసి, మంచి పెళ్లిళ్లు ఆపిన ఘనత ఉన్నది వీరికి. అసలు పురోహితుడు ఎవరు అనే ప్రశ్నకు తావు లేకుండా ముందుగానే జాగ్రత్తపడి శ్లోకాలు, మంత్రాలు వ్రాసుకొన్నాడు. ఎదురు ప్రశ్నించినవారికి శిక్ష పడుతుందని శ్లోకాలతో, బొమ్మలతో సృష్టి చేశారు. స్వలాభ చింతతో స్వయం ఉపాధి కల్పించుకున్నాడు ధర్మాధర్మ విచక్షణ లేకుండా. తన అధికారం శీలక్షరం అవ్వడానికి పన్నాగాలు పూనాడు. తాను ఒప్పినవి ఘోర దూరచరాలైనా మంచివని ఒప్పనివి మంచి పనులైనా దూరాచారాలని స్థిరపరిచాడు. అర్థం లేని మాటలు, అనగూడని ప్రమాణాలు అనిపించేవారు పాటించరని తెలిసినా. ఇదంతా ఆడదానికి కట్టిపడేయడానికి, నరకం చూపించడానికి. మగవాడికి ఎలాంటి దోషము లేదంటారు ఎదురిస్తే పురాణాలు, శాస్త్రాలు చూపిస్తారు. ఇలా చేసి వారు లేని వివాహాలు సనాతన వివాహాలు కాదని చెప్పారు. స్వార్ధం కోసం మగవాడు ఆడదానిని అన్యాయం చేసి అధికారం హస్తగతం చేసుకుంటే, పురోహితుడు తన స్వార్ధం కోసం మతం పేరిట ఆ మగవాని పక్షం చేరి ఇద్దరు కలిసి పాతివ్రత్యంను సృష్టించి వారివారి అధికారంను నిర్బేద్యం చేసుకున్నారు. మగవాడు పురోహితుని సాయం తీసుకొని ఆడదానికి బద్దీ, జ్ఞనం లేదని వారికి స్వతంత్రం ఉండకూడదని, హక్కులు ఏమి లేవని, వారు చడవకూడదని, పర పురుషునితో మాట్లాడకూడదని శాస్త్రాలు పెట్టించాడు. ఆఖరికి తాను చచ్చిన తరువాత కూడా తనకు ఆడది భార్య గానే జీవించాలని నిశ్చయించాడు. కాలం మారింది, సత్యం బయటపడింది. ఆడది మెలకుని తన స్థానం, సమానత్వం నిలబెట్టుకుంటుంది. సంఘంలో ఉన్న కుళ్ళును తొలగించడానికి కంకణం కట్టుకొని భారత భూమిని ధర్మ భూమిగా తయారుచేస్తుంది. ఎన్నో దూరాచారాలతోపాటు పెళ్ళిసూత్రాలను కూడా నిర్ములిస్తుంది.

అనుబంధాలు:

వివాహాన్ని 'కన్యాదానం' అంటాము, ఆ మాటల్లోనే స్త్రీలకు మన సమాజంలో ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. దానం ఇచ్చేవానికి ఆ వస్తువు/జంతువు/భూమి మీద ఉన్న హక్కులు దానం తీస్కునేవారికి బదిలీ అవుతాయి. పైగా ఆ దానాన్ని వారు ఏం చేసినా ప్రశ్నించలేరు. ఇదే జరుగుతుంది కన్యాదానంలో. మేడలో వేసే మంగళసూత్రం, ఒక పశువుని తోలుకుపోవడానికి వాడే తాడు రెండు ఒక్కటే. ఈ సూత్రానికి గౌరవము మరియు ఆసక్తి కలిగించడానికి ఆ తాడుకు పుస్తెలు గుచ్చి అలంకారంగా మార్చారు. మన పురోహితులు చెప్పే మంత్రాలలో ఈ పుస్తెల సంగతి లేదు అది ఉత్తరదివారికి లెనేలేవు, అలాగే తలంబ్రాలు, బియ్యం, అక్షతలు నెత్తి మీద కుమ్మరించడం కూడా! ఇంత నికృష్ట భావంతో గొడ్డుని తొలుకొని వాచినట్టు పెళ్లికూతురిని తెచ్చినాకుడా అన్ని అధికారాలు పెళ్లికూతురువే అని వరుడు ప్రమాణం చేస్తూ పురోహితుడు చెప్పిస్తాడు. భాద్యతలు స్వీకరిస్తూ ఇల్లుని, పిల్లలని బాగా చూసుకుంటానని మంత్రాలలో వధువు అప్పగింత చేసుకుంటుంది. ఇదంతా పచ్చి మోసం. ఒక స్త్రీకి పెళ్ళైనదో, అవ్వనిదో, కన్య లేదా విధవ అని తెలపటానికి చాలా గుర్తులు ఉంటాయి. మంగళసూత్రం, మెట్టెలు, నుదుట బొట్టు, నల్లపూసలు, పచ్చబొట్టు లాంటివి. వారి జుట్టు పెట్టుకునే విధానంలో కూడా పెళ్లి అయినదో లేదో చేపవచ్చును. ఒక ఆడపిల్ల రజస్వల అయినప్పుడు తన రక్తాన్ని ఆశ్రయించుకొని దుష్టశక్తులు మేలుగుతాయి అంటారు. రక్తస్పర్శ భూమిమీద పడితే భూమి దగ్దమై నిస్సారమవుతుందంటారు. సమాజం అంతా దుష్టశక్తులు వల్ల నాశనం అవుతుందని భయపడతారు. ఈ భయం నివారించడానికి గ్రీసు దేశంలో ఒక సంస్థ నువ్వులు తేన కలిపి దంచి గారెలుగాను, బూరెలుగాను చేసి పంచిపెట్టింది. దానిని 'సి సేమ్మలాయ్' అంటారు, మనం ' చిమ్మిలి' అంటాం, పాటిస్తాం మరియు పంచిపెడతాము. ఇలాగే అనేక విషయాలలో మనం కేవలం ఆచారాన్ని మాత్రం జ్ఞపకముంచుకొని పాటిస్తూ, వాటి అంతరార్థలను, ఉద్దేశాలను, కారణాలను మర్చిపోయాం. అరివేనికిి (రంగులు పూసిన కుండలు) మన పెళ్లిళ్లలో ఒక గౌరవ స్తానం ఉంది. కానీ అవి ఇరాన్ దేశీయులు కులదేవతలు, పితృదేవతలు అని గౌరవిస్తారు. ఇలాంటి అర్థంలేని ఆచారాలు మనం మానేయాలి. శాస్త్రకారులు మనకు 8 రకాల పెళ్లిళ్లు ఉన్నాయి అని నిర్ణయించారు. 1. బ్రహ్మ వివాహం - దాతే ముందు కన్యాదానం కోసం ప్రయత్నించడం.
2. దైవ వివాహం - దాత యజ్ఞంలో రుత్విక్కుడికి కన్యను దానమిస్తాడు.
3. ఆర్ష వివాహం - వరుడు దగ్గర గోవులను తీసుకొని కన్యను దానమివ్వటం.
4. ప్రాజాపత్య వివాహం - వరుడు వచ్చి అడిగిన తరువాత కన్యను ధర్మపత్నీగా చేసుకోవాలని చెప్పి దానం ఇవ్వటం.
5. అసుర వివాహం - డబ్బిచ్చి కన్యను కొనుక్కోవడం.
6. గాంధర్వ వివాహం - వధూవరులు ప్రేమించి పెద్దల అనుమతి లేకుండా ప్రళ్లిచేసుకోవడం.
7. రాక్షస వివాహం - పిల్ల బంధువులతో పొట్లాడి బలాత్కారంగా తీసుకోవటం.
8. పైశాచి వివాహం - పిల్ల అపస్మార్కంగా ఉన్నపుడు బలాత్కారంగా తీసుకోవటం.
ఇప్పటి పెళ్లిళ్లు వీటిలో ఏదొక దానికి చెందుతాయి. ఆ మాత్రంకి విధానాలు అని పట్టుపట్టడం అర్థం లేని పని. ఇప్పుడు దేశాకాల పరిస్థితులను అనుసరించి పెళ్లిళ్లు జరుగుతున్నాయి, వాటిని ప్రపంచమంతా గౌరవిస్తున్నారు. ఇవి దేశాసమైక్యతకు, ప్రపంచ శాంతికి దోహదపడ్తున్నాయి.

సంగ్రహించినవారు: గాంధీ: 4,6,7,8,9; ధార్మి: 16,18; రాజశేఖర్ పోనకలా: 5,10,11,12,13,14; పవన్ తేజ నేతి: 15,22,23; పవి: 21; రవళి: 19; సృజన: 1,2,3,17,20,24,25.

Srujana Botcha

Understanding the dynamics.

Banglore