ఇది ఒక స్వేచ్ఛా ప్రపంచం!

విశాలమైన ఈ విశ్వంలో,
తలెత్తుకు బ్రతికే మూర్కునికి,
తలవంచుకొని బ్రతికే పేద వానికి,
పగలతో బ్రతికే కఠినుడికి,
ప్రేమతో బ్రతికే ప్రేమికునికి,
వర్షాలను నమ్ముకొని బ్రతికే రైతుకి,
దయ మీద బ్రతికే ముష్టివానికి,
సేవలని నమ్ముకొని బ్రతికే పిల్లలకి,
లంచం కోసం చూసే లంచగొండికి,
ఓట్ల కోసం పరితపించే నాయకులకి,
కారాగారంలో ఉన్న ఖైదీలకి,
వయ్యారంగా తిరిగే మనుషులకి,
ఆశతో బ్రతికే ఆశ జీవులకి,

ఎవరికి లేదు ప్రేమించే స్వేచ్ఛ?
ఎవరికి లేదు ద్వేషించే స్వేచ్ఛ?
ఎవరికి లేదు ఆనందపడే స్వేచ్ఛ?
ఎవరికి లేదు బ్రతికే స్వేచ్ఛ?
ఎవరికి లేదు తినే స్వేచ్ఛ?
ఎవరికి లేదు ప్రశాంతంగా ఉండే స్వేచ్ఛ?
ఎవరికి లేదు బాధపడే స్వేచ్ఛ?
ఎవరికి లేదు భయపడే స్వేచ్ఛ?
ఎవరికి లేదు విశ్వం మొత్తం తిరిగే స్వేచ్ఛ?
ఎవరికి లేదు లేనే లేదు స్వేచ్ఛ?

అన్ని స్వేచ్ఛలు అందరికి ఉన్నాయి అనుకునే స్వేచ్ఛ మనందరికి ఉంది కానీ, అన్ని స్వేచ్ఛలని అనుభవించే స్వేచ్ఛ మాత్రం అందరికి లేదు సుమీ. మీరు ఏమంటారు?

-సాహితి

Sahithi

A software engineer by profession. A micro writer by passion.

Hyderabad